
సుంకిశాల గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ ఈర్లపల్లి బొందయ్య మృతి చెందడంతో సీపీఐ(ఎం)పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య ,కొండమడుగు నర్సింహ, జగదీష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు ఆదివారం కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహంపై ఎర్రజెండాను కప్పి, పూలమాల వేసి నివాళులు అర్పించారు. బొందయ్య అంత్యక్రియల కోసం వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సాయం సీపీఐ(ఎం)నాయకులు సుంకిశాల మాజీ సర్పంచ్ ఫైళ్ల సంధ్యారాణి ఉపేందర్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, జిల్లా కమిటీ సభ్యులు పగిళ్ళ లింగారెడ్డి , మండల కమిటీ సభ్యులు కొండే కిష్టయ్య ,బుగ్గ చంద్రమౌళి ,పోచం పల్లి మండల నాయకులు ప్రసాదం విష్ణు, శాఖ కార్యదర్శి గూడూరు వెంకట్ రెడ్డి, సహాయ కార్యదర్శి మంగ బాలయ్య, నాయకులు వేముల నాగరాజు, కాటపల్లి వెంకటేశం, గోపగాని కుమార్, వేముల జ్యోతిబస్, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.
బొందయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి – సీపీఐ(ఎం)
ఎండ తీవ్రత వల్ల తట్టుకోలేక మృతి చెందిన బొందయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని, వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున పరిహారం అందించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి కోరారు.