
నవతెలంగాణ – కంటేశ్వర్
దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులను స్మరించుకుంటూ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ నేతృత్వంలో సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని స్వాతంత్రోద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామనే ధృడ సంకల్పంతో, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.