తాజా, మాజీ సర్పంచులకు సన్మానం

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ముప్రై గ్రామ పంచాయతి సర్పంచుల పదవి కాలం ఇటివలే ముగియడంతో తాజా మాజీ సర్పంచు లుగా ఉన్న  వారందరికి  గురువారం నాడు ఎంపిపి యశోదా అద్యక్షతన  ఎంపిడివో నరేష్, ఎంపివో యాదగిరి అధ్వర్యంలో సర్పంచులకు సన్మానించాలనేే కోరికతో అందరు తాజామాజీ సర్పంచులకు  ఒకేవేదికపైన అందరిని  ఆహ్వనించారు. ఎంపిడివో తను స్వయంగా చోరవ తీసుకుని ఎంపిడివో కార్యాలయ సమావేశ హలులో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు. మెుదటగా సర్పంచులకు కార్యాలయ  సిబ్బంది సర్పంచులందరికి సన్మానించారు. తాజా మాజీ పలువురు సర్పంచులు సాదకబాదకాలను,  ఉపన్యాసించారు,   కలిసి మెలిసి ఉండి పార్టీలకు అతీతంగా సన్మాన కార్యక్రమానికి వచ్చారు. ఐదేండ్లుగా గ్రామీలలో కష్టసుఖాలను నోచుకుని ముందుకెళ్లడం జర్గిందని  అన్నారు. అనంతరం ఎంపిడివో నరేష్ మాట్లాడుతు మండలంలోని గ్రామాల ఆభివృద్దిలో  సర్పంచుల పాత్ర కీలకంగా ఉంటుందని తెలిపారు. సర్పంచులు, అధికారులు బాగస్వాములై మంచి పనులు చేయడంతో సహకరించారని, ఎల్లప్పుడు కలిసి మెలిసి ఉంటే కలదు సుఖం ఇని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో  ఎంపిపి యశోదా,  వైస్ ఎంపిపి ఉమాకాంత్ దేశాయి,   విండో చైర్మే్న్ శివానంద్, ఎంపిడివో నరేష్, ఎంపివో యాదగిరి, సీనీయర్ అసిస్టేంట్ రంజీత్ కూమార్, జూనీయర్ అసిస్టేంట్ శ్రావణ్, గంగాధర్, మారుతీ పటేల్, వివిధ పార్టీల నాయకులు, మాజీ సర్పంచులు రాములు, సాయులు, సంజీవ్ పాటీల్,  దినేష్,  తదితరులు పాల్గోన్నారు.