
ఇటీవల ఆగస్టు నెల 31 నుండి సుమారు వారం పది రోజులు విపరీతంగా తుఫాను వానలు కురిసిన నేపథ్యంలో రోడ్లపై విచ్చలవిడిగా వృక్షాలు నేలపై పడ్డాయి. వాటిని తొలగించడానికి పోలీసులకు సహకరించిన జెసిబి ఓనర్లు, డ్రైవర్లకు శుక్రవారం తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అర్ధరాత్రి వర్షంలో లో కూడా ఏజెన్సీలో ఈ రోడ్డుపై చెట్టు పడ్డ అర్ధగంట గంటలోపే పోలీసులు జెసిపి ఓనర్ల డ్రైవర్ల సహకారంతో తొలగించారు. వారి సేవలు అభినందినీయమని ఎస్సై కొనియాడారు. ప్రజాసేవ చేయడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జెసిబి ఓనర్లు సాగర్, దండగల మల్లయ్య, సురేందర్, సుజన్ రెడ్డి, శ్యామ్, వేగురి వేణుగోపాల్ రెడ్డి, శివానంద్ ట్రీ కట్టర్ లు ఇరుప నగేష్, సురభాక ప్రసాద్, జెసిబి డ్రైవర్లు శేఖర్, రమేష్ ఆది రంజిత్ తదితరులు పాల్గొన్నారు.