కాటాపూర్ సర్పంచ్ కు సన్మానం

నవతెలంగాణ- తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపూర్ సర్పంచ్ పుల్లూరి గౌరమ్మ తో పాటు ఉపసర్పంచ్ మేడిశెట్టి పుష్ప లకు గురువారం ఘనంగా సన్మానించారు. గ్రామపంచాయతీ పాలకవర్గం పదవి కాలం ముగింపు సందర్భంగా అంగన్వాడీ మహిళలు సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ పుష్ప లకు పూలమాలలతో, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ కాలంలో చేసిన సేవలను కొనియాడారు. కాటాపూర్ గ్రామానికి ప్రత్యేకత తీసుకొచ్చారని సర్పంచ్ గౌరమ్మను అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కురేందుల సమ్మక్క, సరిత, సుజాత, నిర్మల, శ్రీకళ, వెంకటలక్ష్మి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.