నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణ ప్రసాద్ కి సన్మానం

నవతెలంగాణ శంకరపట్నం
శంకరపట్నం మండల నూతన ఎంపీడీవో గా కృష్ణ ప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శంకరపట్నం మండల పరిషత్ సిబ్బంది ఎంపీఓ బసిరుద్దిన్,సూపరిడెంట్ శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ సదాశివరెడ్డి, కార్యదర్శులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో ను సాదరంగా ఆహ్వానించి ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ,వృత్తిపరంగా తనపై నమ్మకంతో ములుగు జిల్లా నుండి శంకరపట్నం ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించినందున మండలంలోని గ్రామాల అభివృద్ధికై పాటుపడతానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.