బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి పోల్కం వేణును లైన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ పట్టణ అధ్యక్షునిగా నియామకం చేసినందుకు ఆదివారం పట్టణంలోని స్వగృహానికి వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో సన్మానం చేసినట్టు జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేసి ఇలాంటి మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరడమైనది. పట్టణ ప్రధాన కార్యదర్శి పులి యుగంధర్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు బాసెట్టి రాజ్ కుమార్, కార్యదర్శి రెడ్డబోయిన మూర్తి పట్టణ గిరిజన మోర్చా అధ్యక్షులు కేలోత్ పీర్ సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.