ఘనంగా మానాల మోహన్ రెడ్డికి సన్మానం..

నవతెలంగాణ – మోపాల్ 

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టి సెల్ అధ్యక్షుడు యాదగిరి మరియు మోపాల్ మండల్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బున్నే రవి ఆధ్వర్యంలో  .కోపరేటివ్ యూనియన్ చైర్మన్ గా నియమించబడ్డ మానాల మోహన్ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవ యేనలేనిదని కచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పదవులందుతాయని వారు తెలిపారు. అలాగే రాజకీయంగా ఇంకా ఉన్నత స్థాయిలో మానాల మోహన్ రెడ్డి ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆమ్రాబాద్ రవి తదితరులు పాల్గొన్నారు.