బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ సాధన కోసం ప్రారంభించిన నిరాహార దీక్షకు గుర్తుగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం దీక్షా దివస్ ను నిర్వహిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించగా, ముందుగా వినాయక్ నగర్ లోని అమరవీరులస్తూపానికి దీక్షా దివస్ ఇన్ చార్జి ఫారూఖ్ హుస్సేన్, మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా, జడ్పీ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, సీనియర్ నాయకులు రాంకిషన్ రావు తదితరులు నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా ధర్పల్లి మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ తదితరులు రక్తదానం చేశారు.