
మండల కేంద్రంలోని జంబి హనుమాన్ దేవాలయం లో శనివారం ఇటీవల నూతనంగా ఎన్నికైన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులను సన్మానించారు. కొత్తగా ఎన్నికైన గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి, ప్రధాన కార్యదర్శి జైడి బాలక్రిష్ణ, కార్యవర్గ సభ్యులను హిందూ ధర్మ పరిరక్షణ సమితి, జంబి హనుమాన్ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులుగా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, హిందూ ధర్మ పరిరక్షణ సమితి, జంబి హనుమాన్ దేవాలయం కమిటీ ఉట్నూర్ రాజశేఖర్, రమణయ్య, శంకర్, నరేందర్, అలిశెట్టి అజయ్, సుంకరి మురళి, ఇటుక ప్రసాద్, చంద్ర మోహన్, అడిచర్ల రవీందర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.