
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ షాదుల్లా, రామకృష్ణ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ని బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి గ్రామంలో నేలకోని ఉన్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు.గ్రామంలో కళ్యాణ మండపం, కిచెన్ షెడ్, శివాలయం ప్రహరీ గోడ నిర్మాణం కు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు డాక్టర్ శాదుల్లా తెలిపారు. ఎమ్మెల్యే కలిసిన వారిలో డాక్టర్ లింబాద్రి, రామచందర్, బా జేందర్, గణేష్ రెడ్డి, జగదీష్, రమేష్, రాజుల సాయిలు, ఆకుల గంగాధర్, తేజా తోపాటు తదితరులు ఉన్నారు.