నవతెలంగాణ- మద్నూర్
డోంగ్లి మండలంలోని మాదన్ ఇప్పర్గా గ్రామానికి రోడ్డు అభివృద్ధి కోసం కోటి యాభై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించిన జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే ఆ గ్రామ సర్పంచ్ రాజు పటేల్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు ఎమ్మెల్యేకు శాలువాతో ఘనంగా సత్కరించారు డోంగ్లి గ్రామం నుండి మాదన్ ఇప్పర్గా గ్రామం వరకు బీటి రోడ్డు అభివృద్ధి కోసం కోటి 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం ఎమ్మెల్యేకు గ్రామ సర్పంచ్ రాజు పటేల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నిధులు మంజూరు కావడంతో గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలతో బిచ్కుంద ఎమ్మెల్యే ఆఫీసుకు తరలివెళ్లి అక్కడ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.