నవ తెలంగాణ- మహబూబ్ నగర్ ప్రాంతీయ ప్రతినిధి
స్వతంత్ర సమరయోధుడు ఆంధ్ర ప్రదేశ్ తొలి తరం కమ్యూనిస్టు ఉద్యమ నేత మోటూరు హనుమంతరావు 23వ వర్ధంతి సందర్భంగా అయనకు ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో కమ్యూనిస్టు ఉద్యమ నేత మోటూరు హనుమంతరావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రాములు సీనియర్ నాయకులు కిల్లె గోపాల్, కార్యదర్శివర్గ సభ్యులు వి.పద్మ, చంద్రకాంత్, జిల్లా కమిటీ సభ్యులు కడియాల మోహన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏ రాములు మాట్లాడుతూ కమ్యూనిస్టు తొలితరం నేతమోటూర్ హను మంతరావు విద్యార్థి దశలోనే ఉద్యమంలో పాల్గొన్నాడని అన్నారు. స్వతంత్ర పోరాటంలో అభ్యుదయ మార్గాలలో పయనించి అనేక ఉద్యమాలు నిర్మించారని గుర్తుచేశారు. సీపీఐ(ఎం) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యునిగా, పొలిట్ బ్యురొ సభ్యునిగా, శాసనమండలి సభ్యునిగా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రజావాణిలో ప్రజా సమస్యలపై పోరాటం చేశారని తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో త్వరగా జూరాల ప్రాజెక్టు నిర్మాణం చేయాలని అనేక పోరాటాలు చేశాడని గుర్తు చేశారు. అనేకమంది కమ్యూనిస్టు కార్యకర్తలని తయారు చేయడంలో ఎంతో కష్ట పడేవారు అన్నారు ప్రజాశక్తి దినపత్రిక వ్యవస్థాపక సంపాదకుడిగా అనేక సంవత్సరాల పాటు పనిచేశారని అన్నారు అలాంటి నాయకున్నిి పార్టీకర్తలు ప్రజలు ఎల్లప్పుడు గుర్తించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు భరత్ సురేష్ భగవంతు బుర్రి భాస్కర్ నాగరాజు రేణుక పాల్గొన్నారు.