మండలానికి నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్ సువర్ణ కు, ఎస్ఐ నరేష్ లకు మంగళవారం కాంగ్రెస్, బి ఆర్ ఎస్, బిజెపి పార్టీ నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ సువర్ణ, ఎస్ఐ నరేష్ లు మాట్లాడుతూ…. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని, అందరం కలిసి మండల అభివృద్ధికి తోడ్పడాలని, శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు పాల మల్లేష్, కుసంగి రాజా నర్సు, బిజెపి నాయకులు నరేష్, కాంగ్రెస్ నాయకులు తూర్పు రాజు, కిషన్ యాదవ్, శీల సాగర్, రఫిక్, రత్నాకర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.