పంచాయతీ కార్యదర్శులకు సన్మానం..

నవతెలంగాణ-డిచ్ పల్లి : డిచ్ పల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి పి.యోహాన్ ( డిస్టిక్ డిప్యూటీ కమిషనర్ లేబర్ డిపార్ట్మెంట్ నిజామాబాద్ ),  యం.పి.డి.ఓ. రవీందర్ ల అద్వర్యంలో బదిలీ పై వెళ్ళిన గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఇతర మండలల నుండి నూతనంగా వచ్చిన పంచాయతీ కార్యదర్శులకు  స్వాగతం పలుకుతూ వారిని పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యం.పి.ఓ. శ్రీనివాస్ గౌడ్, ఎ.పి.ఓ. ( ఇ.జి.యస్.) సుధాకర్ రెడ్డి, అయా గ్రామాల పంచాయతి కార్యదర్శులు,  మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.