పంచాయతీ కార్యదర్శులకు సన్మానం

Tribute to Panchayat Secretariesనవతెలంగాణ – జన్నారం
“గ్రామాలే దేశభివృదికి పట్టుకొమ్మలు” అనే జాతిపిత వాక్యాన్ని అనుసరిస్తూ గ్రామాల అభివృద్ధికోసం నిరంతరం కృషిచేస్తున్న గ్రామ కార్యదర్శిల సేవలు అభినందనీయమని నేతకాని మహర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాయిని ప్రసాద్ నేత అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన మండల కార్యదర్శిల సంఘ నాయకులను శాలువాతో సత్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న అభివృద్ది పనులే ఇటీవల జిల్లాలోనే ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న లకావత్ శ్రీనివాస్   నిదర్శనం అని తెలిపారు. ఇదే స్ఫూర్తిగా పనిచేసి మరింత ప్రజలకు సేవలను అందించడంలో కార్యదర్శులు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు లకవత్ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి చేటుపల్లి మధు, కోశాధికారి విశ్వశ్రీ జాయింట్ సెక్రటరీ సాగర్ రమేష్, నాయకులు వొల్లల నర్శగౌడ్, మంతెన వెంకటేష్, దుర్గ్ వినోద్, అల్లూరి వినోద్ కుమార్, రుబెన్, వికాస్, సురేష్, ఆదర్శ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.