మండలంలోని బదలీపై వెల్తున్న ఏడుగురు పంచాయితీ కార్య దర్శులకు మండల అభివృద్ధి కార్యాలయ సిబ్బంది శనివారం ఘనంగా శాలువాలతో సన్మానించారు.బదిలీపై వెళ్లిన వారిలో వల్లెం కుంట కార్యదర్శి నరేష్, ఇప్పలపల్లి కార్యదర్శి సరిత, నాచారం కార్యదర్శి రమేష్, కొండంపేట కార్యదర్శి కుమార స్వామి, దుబ్బపేట కార్యదర్శి ప్రవీణ్, కొయ్యూరు కార్యదర్శి ప్రసాద్, చిన్నతూండ్ల సమ్మరాజ్ లు బదలీ కావడంతో వారికి శాలువతో సత్కరించి ఆత్మీయ వీడ్కోలు తెలిపారు. నూతనంగా విధుల్లో చేరిన పంచాయితీ కార్యదర్శులు దేవేందర్ రెడ్డి, చరత్ చంద్ర, రజిత, సంపత్ లకు స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, ఎంపిడిఒ శ్యాంసుందర్, ఎంపిఒ విక్రమ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ ఆదిత్యలు, సిబ్బంది పాల్గొన్నారు.