పంచాయతీ కార్యదర్శి అంజయ్యకు సన్మానం

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలంలోని అంజనీ గ్రామ పంచాయతీ కార్యదర్శి  బాధ్యతలు నిర్వహిస్తున్న అంజయ్య పదవీకాలం ముగివ్వడంతో సోమవారం రోజున మండల పరిషత్ కార్యాలయంలో ఆయనను ఎంపీపీ ప్రతాపరెడ్డి ఇంచార్జ్ ఎంపీడీవో సూర్యకాంత్ సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండున్నర సంవత్సరాల కాలంలో అంజనీ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన  అంజయ్య సేవలు మరవలేనిది, అంజనీ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు చాలా కృషి చేశారని, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్న వారి దృష్టికి రాగానే గ్రామంలో ఉన్న తాగునీరు, మురికి కాలువలు, అంతర్గత రోడ్లు, శుభ్రపరచుట ఇటువంటి అనేక కార్యక్రమాలో చురుగ్గా విధులు నిర్వహించే వారని, ఈయన పనితీరును అందరూ ఆదర్శంగా తీసుకొని గ్రామాలను అభివృద్ధి పథంలో  వెళ్లే విధంగా మిగతా పంచాయతీ సెక్రటరీలు  కృషి చేయాలని ఆయన అన్నారు. ఉద్యోగ రీత్యా అందరికి పదవి విరణ తప్పదని అన్నారు. అనంతరం ఆంజయ్యను అధికారులు ప్రజా ప్రతినిధులు పంచాయతీ కార్యదర్శిలు శాలువలతో సన్మానించి స్వీట్లు తినిపించారు. ఈ కార్యక్రమంలోఎంపీపీ ప్రతాప్ రెడ్డి,కో అఫ్సన్ మెంబర్ జాపర్ షా,ఇంచార్జి ఎంపీడీఓ సూర్యకాంత్, పంచాయితీ కార్యదర్శి లు పాల్గొన్నారు.