నవతెలంగాణ- భీమ్‌గల్
తెలంగాణ సర్కిల్ లో తపాలా శాఖ ద్వారా ఖాతాల ఓపెనింగ్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి భారత దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అప్సర్ ను మండల పోస్టుమాస్టర్లు శాలువా తో సన్మానించారు. భీమ్‌గల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ తపాలా శాఖ ద్వారా తెలంగాణ సర్కిల్ లో నుండి దేశంలోనే ఎక్కువ మొత్తం లో పొదుపు ఖాతాలను ఓపెన్ చేయించారు. ఈ మేరకు గురువారం భీంగల్ పోస్టల్ కార్యాలయం లో అప్సర్ ను సన్మానం చేశారు. పూల మాల, శాలువా తో సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్బంగా పోస్టల్ ఉద్యోగులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన బీపీఎమ్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలన్నారు. ప్రతి ఉద్యోగి విధి నిర్వహణ లో భాగంగా పోస్టల్ డెలివరీ, నగదు బదిలీ, కొత్త ఖాతాల ఓపెనింగ్, ఇన్సూరెన్స్ తో పాటు తపాలా శాఖ ద్వారా అందజేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ పి ఏం మదన్ లాల్, పోస్ట్ మెన్ బాలకృష్ణ , ముత్తన్న, రాములు తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.