రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆశీస్సులతో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా అయిత ప్రకాష్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టారు. ఈసందర్బంగా సింగిల్ విండో డైరెక్టర్ ఇప్ప మొండయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేశారపు చెంద్రయ్య, కుంట సది, రావుల అంజయ్య, తిర్రి సమ్మయ్య, గుంటుకు తిరుపతి, పైడాకుల సమ్మయ్య, జక్కుల వెంకటస్వామి, ఆర్ని రాజబాబు, జంజర్ల ప్రశాంత్ ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువా, పూలమాలతో ఘనంగా సత్కారం, బొకే అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.