– చేసిన ఆన్సాన్ పల్లి తాజా మాజీ సర్పంచ్ జగన్
నవతెలంగాణ –మల్హర్ రావు.
రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆశీస్సులతో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టిన అయిత ప్రకాష్ రెడ్డిని ఆన్ సాన్ పల్లి తాజా మాజీ సర్పంచ్ గుగులోత్ జగన్ నాయక్, కాంగ్రెస్ నాయకులు కుడుములు శ్రీనివాస్, కాసర్ల రాజయ్య,శ్రీనివాస్, ఆకునూరి రవిందర్, దూలం రాజు,బోయిని రాంబాబు,తాడిచెర్ల గ్రామానికి చెందిన బిర్నేని దుర్గాప్రసాద్, గుగ్గిళ్ల రాజ్ కుమార్, రవి, తాండ్ర సది తదితరులు ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువా, పూలమాలతో ఘనంగా సత్కారం చేసి, బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.