పదవి విరమణ పొందిన అంగన్ వాడి టీచర్లకు సన్మానం

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో అంగన్ వాడి టీచర్లుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల పదవి విరమణ పొందిన వి.వెంకట నర్సమ్మ,డి.విజయ, హైమావతి తదితర అంగన్ వాడి టీచర్లకు శనివారం అంగన్ వాడి కేంద్రం-2లో అంగన్ వాడిల మండల సూపర్ వైజర్ సరస్వతి,తోటి అంగన్ వాడి టీచర్లు,బాలమ్మ, జయప్రద,వెంకట నారమ్మ,ఓదెల లక్ష్మీ, రేపాల అరుణ,శీలం ధనలక్ష్మిలు శాలువాలతో  ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా 42 సంవత్సరాలు చిన్నారులకు సేవలందించి, పదవి విరమణ పొందిన టీచర్లకు సూపర్ వైజర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.