
ప్రముఖ కవి, కళాకారుడు, సోషల్ మీడియా గ్రూపు నిర్వాహకుడు ముక్కెర సంపత్ కుమార్ ను కవి సాయంత్రం గ్రూపు వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి నాచారం ప్రతిభ పాఠశాలలో ఘనంగా సన్మానించారు. సోషల్ మీడియాలో సుమారు 1200 మందితో సాహిత్య గ్రూపును నిర్వహిస్తూ అనేక ప్రక్రియల ద్వారా నూతన రచయితలకు ప్రోత్సాహం అందిస్తున్నందుకు సంపత్ కుమార్ ను ప్రజాకవి జయరాజు, సినిగే రచయిత మౌనశ్రీ మల్లిక్, పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ గాజుల శ్యాంప్రసాద్ లాల్, ఎడిటర్ బైస దేవదాసు, కాళిదాసు తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ స్కూల్ యాజమాన్యం మందడి సుధాకర్ రెడ్డి, విజయలక్ష్మి, నూకల అశోక్ యాదవ్, ఎడెల్లి రాములు, మాచర్ల మల్లేశం, ఉభయ రాష్ట్రాల పలువురు కవులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.