
నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహా శక్తి క్షేత్రం సిద్దుల గుట్ట వద్ద ఆదివారం ధ్యాన ఆత్మ జ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నవనాథసిద్దేశ్వర పిరమిడ్ చైర్మన్ శ్రీ ఏనుగు తిరుమల గంగారం తన మనుమడు ధ్రువిన్ రెడ్డి మొదటి జన్మదినం సందర్భంగా ఆర్మూరు పట్టణంలో గల 11 ,12వ వార్డులకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు 24 మంది ని శాలువాతో ఘనంగా సన్మానించి వారికి నూతన వస్త్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి ఎస్ ఎస్ ఎం జిల్లా అధ్యక్షులు బి. సాయికృష్ణా రెడ్డి, ఆర్గుల్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, సభ్యులు మామిడి లక్ష్మారెడ్డి, పెంబర్తి నారాయణ, శేఖర్ రెడ్డి, అమరవాజి శ్రీనివాస్, రెడ్డి మల్లయ్య, అక్లూర్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.