సర్పంచ్ మారెడ్డి శ్రీదేవి నర్సిరెడ్డికి సన్మానం

నవతెలంగాణ – చండూరు 
మండలంలోని  శిర్దేపల్లి   గ్రామ సర్పంచ్  మా రెడ్డి శ్రీదేవి నర్సిరెడ్డి, ఉప సర్పంచ్ పల్లె లింగయ్య, ఐదు సంవత్సరాలు  గ్రామ అభివృద్ధికి పాటు పడినందుకు గాను    కాంగ్రెస్ మండల  నాయకులు  భారతరాజు మల్లేష్ ఆధ్వర్యంలో   వారిని శాల్వలతో  ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్  మా రెడ్డి శ్రీదేవి నర్సిరెడ్డి మాట్లాడుతూ తన పదవి కాలం పూర్తిగా నాకు  సంతృప్తి నిచ్చిందని  అందరి సహకారంతో అవకాశం ఉన్నంత వరకు అభివృద్ధి చేశానని,  పదవి ఉన్నా, లేకపోయినా  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో  మరింత గ్రామ  అభివృద్ధికి కృషి చేస్తానని  తెలిపారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ జిల్లా  నాయకులు  పోల వెంకటరెడ్డి, బాతరాజు  శంకర్, గిరి,బాతరాజు సైదులు, భారతరాజు శంకర్, గంట రవి, గంట మల్లయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.