ఎస్ఐకి సన్మానం

నవతెలంగాణ మోర్తాడ్
ఇటీవల నూతనంగా బదిలీపై వచ్చిన మోర్తాడ్ ఎస్ఐ భూ పెళ విక్రమ్ కు స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సన్మానించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు పోలీసులకు ఎల్లవేళలా అందిస్తామని గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జక్కం అశోక్ అన్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికి పోలీసులకు గ్రామస్తుల తరఫున తాము ఎప్పుడు అందుబాటులో ఉంటామని, సమస్యల పరిష్కారానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రాజేందర్ పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.