ఎస్ఐ లెనిన్ గౌడ్ కి సన్మానం

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలానికి నూతనంగా విచ్చేసి బాధ్యతలు చేపట్టిన ఉప్పునుంతల మండల ఎస్సై లెనిన్ గౌడ్ ని మంగళవారం వెల్టూర్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు కలిసి పూలమాలవేసి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, మాజీ సర్పంచ్ గుండెమోని లింగమయ్య యాదవ్, మల్లేష్, సాయిబాబు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.