బాధిత కుటుంబాన్ని పరామర్శ….

Counseling the victim's familyనవతెలంగాణ – బజార్హత్నూర్ 
మండల కేంద్రానికి చెందిన సూది నందు, సూది వినాయక్ ల తండ్రి సూది రాములు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం వారి స్వగృహణికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతే కాకుండా సీనియర్ నాయకులు చట్ల గజ్జయ్య మామ సూది రాములు మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల యువజన సంఘం అధ్యక్షులు డుబ్బుల చంద్రశేఖర్, మండల కన్వీనర్ రాజారాం, నాయకులు దిసి రమణ, చిలుకూరి భూమన్న, అందె ప్రకాష్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.