కామారెడ్డి అయ్యప్ప దేవాలయ కమిటీ చైర్మన్ గాదె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గోనే శ్రీనివాసులు సోమవారం మండలంలోని శ్రీ స్వయంభూ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ వారికి శాలువాతో సన్మానించి, స్వామివారి జ్ఞాపికను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు బండి ప్రవీణ్, పెండ్యాల నర్సారెడ్డి, పూజారి గణేష్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.