ఇంచార్జీ ఎంఈఓకు సన్మానం..

నవతెలంగాణ-బెజ్జంకి 
ఇంచార్జీ ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన యాదవ రెడ్డిని మంగళవారం మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రం వద్ద మండలంలోని ఉపాధ్యాయ సంఘాల అధ్వర్యంలో శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. అయా పాఠశాలల కాంప్లెక్స్ ప్రధానోపాద్యాయులు శ్రీరాములు,గోపి కృష్ణ, ఎస్టీయూ, డీటీఎఫ్, పీఆర్టీయూ, యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు వడ్లకొండ శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, నారోజు శంకరాచారి, రామంచ రవీందర్,తప్పెట ఓదయ్య,బోనాల రాజేందర్, నాగయ్య, మల్లారెడ్డి, మాలతి, నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు రజనిష్, భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.