నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ వెనుక గల ప్రాంతంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ నిజామాబాద్ బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో స్వర్గీయ రతన్ టాటా సంస్మరణ సభ, అన్న వితరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సభ్యులు మాట్లాడుతూ..రతన్ టాటా గురించి ఆయన చేసిన సేవలను గురించి ఆయన సాధించిన విజయాలను గురించి ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా తక్కువే ఆయన విధానం ఆయన దాతృత్వం వ్యాపార రంగంలో ఆయన చేసిన ఎనలేని కృషి సేవా రంగంలో ఆయన చూపిన దార్శనికత ఆయనలో ఉన్నటువంటి మానవతా కోణం ఇవన్నీ ఆయనని ఈ భారత సమాజంలో చిరస్మరణీయుని చేస్తాయి. మన దేశాన్ని వ్యాపార రంగంలో ప్రపంచ దేశాల సరసన నిలిపిన మహనీయుడు, దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు తన వంతు సాయాన్ని అందిస్తూ ఒక పెద్దన్నగా ముందుండి నడిపాడు ఎన్నో రాష్ట్రాల్లో ,ఎన్నో మారూముల ప్రాంతాల్లో విద్య ,వైద్యం,మరియు ఆరోగ్య సంరక్షణ పట్ల అవగాహన కల్పిస్తూ మంచినీటి ప్రాజెక్టులు, స్కుల్లు హాస్పిటల్స్ ఏర్పాటు చేసిన ఘనత టాటా గారిది. దేశ రక్షణ వ్యవస్థకు అవసరమైన అధునాతన పరికరాలు సమకూర్చి రక్షణ రంగానికి ఆయన చేసిన సాయం అద్భుతం. ఈరోజు దేశ వ్యాపార రంగంలో ఎన్నో గొప్ప గొప్ప మేటి సంస్థలను స్థాపించి వాటన్నింటినీ టాటా అనే ఒక గొడుగు కింద తీసుకువచ్చి కొన్ని కోట్ల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని సృష్టించి వారి కుటుంబాల్లో ఒక వెలుగులు నింపినటువంటి మార్గదర్శకుడు మన రతన్ టాటా.
దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రకృతి విలయాలు సంభవించిన కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు దేశాన్ని కుదిపేసిన నేనున్నానంటూ స్వచ్ఛందంగా ఒక ట్రస్ట్ ని స్థాపించి ఈరోజు దాని ద్వారా మొత్తం టాటా సంపాదనల నుంచి 66% ఈ దేశ పౌరుల అభ్యున్నతికి సంక్షేమానికి వెచ్చించామని చెప్పిన ఒక గొప్ప మానవతా శిఖరం మన రతన్ టాటా గారు. ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆర్డర్ ఆఫ్ ఇటలీ రిపబ్లిక్,గ్రాండ్ ఆఫీసర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ వంటి అనేక విదేశీ గౌరవ పురస్కారాలను స్వీకరించి, అజాతశత్రువుగా ప్రపంచంలో ఆదర్శప్రాయుడిగా నిలిచి రతన్ టాటా ఒక దిక్సూచి అయ్యారు. మన దేశం ఇచ్చిన పద్మభూషణ్ పద్మ విభూషణ్ వంటి మహోన్నత పురస్కారాలకు వన్నెతెచ్చిన మహనీయుడు భారతరత్న బిరుదుకి అర్హుడు మన రతన్ టాటా ఆయన చూపినటువంటి ఈ మార్గంలో ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో మేము సైతం. ఒక రవ్వంతైన ఉండాలన్న ఆలోచనతో మేము నిజాంబాద్ రతన్ టాటా ట్రస్ట్ ని స్థాపించి ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్దామని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఇది ఆరంభం మాత్రమే ఇకముందు మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలను ఆయన స్ఫూర్తితో ఆయన బాటలో నడుస్తూ నెరవేరుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. జై రతన్ టాటా జై భారత్ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో హబీబ్ మియా, ప్రసాద్ రెడ్డి, సాయిరాం పవిత్ర ,శారద , సిరిపురం రవీందర్, భవాని పాల్గొన్నారు.