పుల్వామా గటనలో మరణించిన వీర జవాన్లకు ఘన నివాళి

నవతెలంగాణ- మోపాల్
బుధవారం రోజున మంచిప్ప గ్రామంలో బజరంగ్దళ్ ఆధ్వర్యంలో 2019 ఫిబ్రవరి 14 నాడు పుల్వామా దాడిలో మరణించిన వీర జవాన్లకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జై భారత్ యూత్ అద్యక్షులు సాయిరాం మాట్లాడుతూ భారత దేశ సరిహద్దే తల్లి, చెల్లి, ఇల్లు అనుకుని ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్న.. ప్రతి ఒక్క సైనికుడికి పాదాభివందనం అన్నారు. ఈ కార్యక్రమంలో  విలేజ్ కమిటీ అధ్యక్షుడు నరేష్ రెడ్డి, వీడిసి మెంబర్స్, బేడ్ల శ్రీకాంత్ , మాజీ వీడిసి అధ్యక్షులు సత్యనారాయణ, బజరంగ్ దళ్ మంచిప్ప శాఖ అధ్యక్షులు వేణు చారి,ఉపాధ్యక్షులు ఉలెంగ సాగార్, వికాస్, కార్యదర్శి బడవత్ సుమన్, బండ సాయికుమార్, వడ్ల ప్రకాష్, సాయిరెడ్డి, యువకులు వీడిసి మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.