నూతన ప్రధానోపాధ్యాయుడికి సన్మానం

నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని అయినాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు నూతనంగా వచ్చిన ప్రధానోపాధ్యాయుడు ఏ.బాబు చందునికి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలను దోమ మండల్‌ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోవర్ధన్‌ ముదిరాజ్‌ తెలియజేశారు. ఈ సందర్బంగా గత కొన్ని సంవత్సరాల నుంచి అయినాపూర్‌లో పాఠశాలలో ప్రధానోపాధ్యా యులు లేకపోవడం, అదేవిధంగా సబ్జెక్టు హిందీ ఉపాధ్యాయులు కూడా లేకపోవడం విద్యార్థులకు చాలా కొరత ఏర్పడిందనీ, హిందీ ఉపాధ్యాయుడు కూడా తీసుకురావడం ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈ ఏడాది మండలంలో ఐనపూర్‌ పాఠశాలను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని ప్రధానోపాధ్యాయుడు తెలిపాడు. కార్యక్రమంలో నల్ల వెంకటేష్‌, వెంకట్‌ రాములు, రమేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.