
మండల తహసిల్దార్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రమేష్ ను బుధవారం పలువురు ప్రజా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. అదిలాబాద్ జిల్లా నుండి పదోన్నతి పై కమ్మర్ పల్లి నూతన తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టినందుకు అభినందిస్తూ, శాలువాతో సత్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి చేస్తానని, ఇందుకు ప్రజా ప్రతినిధుల సహకారం కూడా ఎంతో అవసరమని ఈ సందర్భంగా తహసిల్దార్ రమేష్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నర్సాపూర్ సర్పంచ్ పెండే ప్రభాకర్, డిప్యూటీ తాసిల్దార్ భాస్కర్, ఆర్ ఐ శరత్, టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల నాయకులు పాలెపు రవి కిరణ్, ఆఫీస్, తదితరులు పాల్గొన్నారు.