టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు సన్మానం..

Tribute to TPCC President Mahesh Kumar Goud..నవతెలంగాణ – డిచ్ పల్లి
ఏఐసీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లా కు చెందిన బోమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను నియమించడంతో ఇందల్ వాయి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోమవారం హైదరాబాదు లోని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పుల బోకే, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఇందల్ వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ రూరల్ అద్యక్షులు సంతోష్ రెడ్డి, తిర్మన్ పల్లి మాజీ ఎంపిటిసి చింతల కిషన్, సినీయర్ నాయకులు బోర్ రాజేందర్ రెడ్డి, లారీ గంగారెడ్డి, సుధాకర్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.