పొత్నక్ రోజా చిత్రపటం వద్ద నివాళులు..

Tributes at the portrait of Potnak Roja..– హజరైన రాష్ట్ర మంత్రులు
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పొత్నక్ ప్రమోద్ గారి సతీమణి రోజా అనారోగ్యంతో మృతి చెందగా ఆదివారం రోజు భువనగిరి పట్టణంలోని వైఎస్ఆర్ గార్డెన్ లో నిర్వహించిన శాంతి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రివర్యులు రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ , తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొత్నక్ రోజా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత పొత్నక్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.