నవతెలంగాణ – అశ్వారావుపేట
సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బుడితి చిరంజీవి తండ్రి రామానాయుడు కు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు,రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య లు సోమవారం నివాళులు అర్పించారు.ఈ నెల 12 న (గురువారం) రామానాయుడు మృతి చెందారు.సోమవారం ఆయన దశ దిన కర్మ ను విజయనగరం జిల్లా, రేగిడి ఆముదాలవలస మండలం,తోకలవలస లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారు రామానాయుడు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.చిరంజీవి మాతృమూర్తి చెల్లెమ్మ,సంతానాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య,రేపాకుల శ్రీనివాస్,నవతెలంగాణ విలేకరి మడిపల్లి వెంకటేశ్వరరావు,కాంగ్రెస్ మండల అద్యక్షులు తుమ్మ రాంబాబు,చిరంజీవి మిత్రులు పసుపులేటి ఆదినారాయణ,అల్ల నాగేశ్వరరావు లు పాల్గొన్నారు.