నవతెలంగాణ- ఆర్మూర్
విద్యాసంస్థల చైర్మన్ ప్రజ్ఞ గంగామోహన్ 2వ వర్ధంతి సందర్బంగా ప్రజ్ఞ ఐఐటీ స్కూల్ నందు బుధవారం డైరెక్టర్ ప్రజ్ఞ వంశీ రోమా ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దున గంగా మోహన్ కృషి ఎవ్వరు మర్చిపోలేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థిని, విద్యార్థులు ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మౌనం పాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞ వంశీ తదితరులు పాల్గొన్నారు.