కొవ్వొత్తులతో గద్దర్ కు ఘన నివాళులు..

నవతెలంగాణ-బెజ్జంకి 

ప్రజా గాయకుడు, కవి, రచయిత గద్దర్ ఆకాల మృతికి మండల కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వద్ద సీపీఐ పార్టీ అధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శనతో సోమవారం ఘన నివాలర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేశ్,ఏఐఎస్ఎఫ్ జిల్లాధ్యక్షుడు సంగెం మధు, నాయకుడు దొంతరవేణీ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.