నవతెలంగాణ – దుబ్బాక
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం దుబ్బాక పట్టణంలో కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, కాంగ్రెస్ దుబ్బాక మున్సిపల్, మండలాధ్యక్షులు ఏసురెడ్డి, కొంగర రవి, ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు అనంతుల శ్రీనివాస్, ఆకుల భరత్, మంద శ్రీనివాస్, మచ్చ శ్రీనివాస్, జనార్దన్ రెడ్డి పలువురున్నారు.