తెలంగాణ సిద్ధార్థ ప్రొఫెసర్ జయశంకర్ సార్ 9 వ జయంతి సందర్భంగా ఆత్మకూరు మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాగెళ్లి రాజు మండలంలోని అక్కంపేటలోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు జయశంకర్ సార్ ఎనలేని కృషి చేశారని అన్నారు . వారి ఉద్యమ ఫలితమే నేడు తెలంగాణ సిద్ధించింది అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను రాష్ట్ర ప్రజలకు విడమరిచి తెలిపిన మహోన్నత వ్యక్తి సార్ అని కొనియాడారు. తెలంగాణకు వారు చేసిన సేవలు చిరస్మరణీయం మని అన్నారు . అందరి హృదయాల్లో సార్ చిర స్థాయిలో నిలుస్తారని అన్నారు. కార్యక్రమంలో బిఆర్ సీనియర్ నాయకులు మాధాసి కృష్ణ పాల్గొన్నారు.