సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కి ఘన నివాళులు

నవతెలంగాణ – చండూరు 
బడుగు,బలహీనవర్గాలను ఏకంచేసి తనకున్న కొద్దిపాటి సైన్యంతో,ఆయుధసంపత్తితో గోల్కొండ కోటతో పాటు తెలంగాణ ప్రాంతంలోని 32 కోటలను జయించి,బడుగు బలహీనర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన భారతదేశపు తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  314 వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడికి చండూరు పట్టణ అధ్యక్షుడు పందుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో  ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు సోమ నరసింహ  మాట్లాడుతూ పాపన్న ఆశయాలను సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొబ్బల మనోహర్ రెడ్డి,సముద్రాల వెంకన్న, జిల్లా నాయకులు నకిరేకంటి లింగస్వామి గౌడ్, భూతరాజు శ్రీహరి, రావిరాల శ్రీను,తడకమళ్ళ శ్రీధర్,గణేష్ కొల్లూరు వెంకన్న కటకం నరేష్ బొబ్బలి శివ పుల్లయ్య దూస గణేష్,చెరుపల్లి,కృష్ణ  తదితరులు పాల్గొన్నారు.