
భువనగిరి మండలం హనుమపురం గ్రామ సర్పంచ్ఆ టిర్ఎస్ పార్టీ నాయకులు ఎడ్ల రాజిరెడ్డి శనివారం ఉదయం అనారోగ్య కారణంగా మృతి చెందారు. హనుమపురం గ్రామంలో వారి స్వగృహంలో భౌతికకాయానికి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.