
పట్టణంలోని 29వ వార్డులో ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గుర్తించి ప్రతి మహిళ సావిత్రి బాయి గారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు చదివి, దేశ నలుమూలలో స్త్రీ యొక్క విలువని చాటాలని కౌన్సిలర్ బి సాయికుమార్ మంగళవారం తెలిపారు.. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సావిత్రిబాయి పూలే పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి , కల్పన, శిల్పా, స్వాతి, శీతల్, బి.ప్రవీణ్, పి.వికాస్, పి.సాయికుమార్, పి.సచిన్ డి.రాజేష్, భి. అభీ, ఎస్.వంశీ, జుబెర్, మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.