
శంకరపట్నం మండల కేంద్రంలో శుక్రవారం కామ్రేడ్ సీతారాం ఏచూరి కి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు వెల్మారెడ్డి రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,.. కామ్రేడ్ సీతారాం ఏచూరి 1952 జన్మించి పిల్లల 12న ఢిల్లీలో చనిపోయారు. ఆయన పదవ తరగతి వరకు హైదరాబాద్ లో చదివి ఉన్నత చదువులు ఢిల్లీలో చదివి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ తర్వాత రెండు సంవత్సరాలకి సీపీఐ(ఎం) పార్టీలో సభ్యత్వం తీసుకొని అంచెలంచెలుగా ఎదిగి నాలుగు సార్లు రాజ్యసభ సభ్యునిగా కేంద్ర కమిటీ సభ్యునిగా జాతీయ కార్యదర్శిగా ఎన్నో ఉన్నత పదవులు సంపాదించి అహర్నిశలు పేద ప్రజల కొరకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని,ఆయన మరణం యావత్ ప్రపంచానికి తీరని లోటు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మైదం శెట్టి యుగంధర్, తిరుపతి, కొట్టే రాజిరెడ్డి, ఐలయ్య,సమ్మయ్య,రాజు,కుమార్,రవి,రాజు, సమ్మయ్య,మొగిలి, శివ,వెంకన్న,లు పాల్గొన్నారు.