తొలి అమరుడు పుట్టకొక్కుల కిష్టయ్య ముదిరాజ్ నివాళులు..

Tributes to the first immortal Puttakokkula Kishtaiya Mudiraj..నవతెలంగాణ  – భువనగిరి
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన  పోలీస్ కానిస్టేబుల్ పుట్టకొక్కుల కిష్టయ్య ముదిరాజ్ గ 15వ వర్ధంతిని పురస్కరించుకొని, యాదాద్రి భువనగిరి జిల్లా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటుచేసిన పోలీస్ కిష్టయ్య చిత్ర పటానికి సంఘ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుక్కదుగు సోమయ్య ముదిరాజ్,  సాదు విజయ్ కుమార్ ముదిరాజ్  మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన సర్వీస్ తుపాకితో కాల్చుకొని మొట్టమొదటిగా అమరుడైన వ్యక్తి పోలీస్ కిష్టయ్య అని తెలిపారు. ఆయన మరణం స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని గుర్తు చేశారు. పోలీస్ కిష్టయ్య జయంతి, వర్ధంతి వేడుకలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు.  రానున్న  స్థానిక సంస్థల ఎన్నికల్లో  ముదిరాజు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో  మాటూరి అశోక్, గద్దె నర్సింహ,ఎనబోయిన జంగీర్,ఉడుత భాస్కర్,బీసుకుంట్ల సత్యనారాయణ,కుక్కదుగు పద్మ,బోయిని బాలరాజ్, మొలకల సత్యనారాయణ,  పిట్టల రాములు,బొబ్బిలి ఉమా మహేశ్వర్ ,గోరెంకల శివశంకర్, కొలుపుల నాగరాజు, నీల శ్రీనివాస్, భగత్, పిట్టల బాలరాజు,పిట్టల కనకయ్య,ఎనబోయిన సత్యనారాయణ, కస్తూరి పాండు, పులి వెంకటేష్, బీమారి నర్సింహ,కొలుపుల నాగరాజు,మేడబోయిన వెంకటేష్,గీస కొండల్,తుమ్మల పాండు,ఉడుత వెంకటేష్,పెంట యతీష్, పెంటబోయిన నాగరాజు,జిన్నా కృష్ణ,,లింగాల బాలరాజు,దొప్ప వెంకటేష్,పోతరాజుల రవి,నీల శ్రీనివాస్,కనుక బాలరాజ్  పాల్గొన్నారు.