పట్టణ కోర్ట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యంగ దినోత్సవాన్ని మంగళవారం న్యాయవాదులు ఘనంగా నిర్వహించారు. 75 వ రాజ్యంగ దినోత్సవం పురస్కరించుకొని బార్ అసోసియేషన్ అధ్యక్షులు తెడ్డు నర్సయ్య రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పోడేటి శంకర్ న్యాయ వాదులు జక్కుల శ్రీధర్,రామ కృష్ణ,కిష్టయ్య,సుభాష్,గంగాధర్,విజయ లక్ష్మి,అనిల్,చరణ్,సుకేష్,గణేష్,శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.