నవతెలంగాణ పెద్దవూరు: మృతుని బందువులకు అన్నాధానం చేసిన ఎన్ఎస్ఆర్ పౌండేషన్ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం ఊట్కూరు గ్రామపంచాయతీకి చెందిన జెర్రిపోతుల అనసూర్య అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. అంత్యక్రియలో కడవరి చూపు చూసేందుకు వచ్చిన బంధుమిత్రులకు భారతీయ జనతా పార్టీ నాగార్జునసాగర్ నియోజకవర్గ బీజేపీ ఇన్ చార్జి, ఎన్ఎస్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంకణాల నివేదితరెడ్డి 150 మంది మృతిని బంధువులకు తన ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిడమనూరు మండల అధ్యక్షుడు వీరారెడ్డి, ఊట్కూరు గ్రామ నాయకులు పాలకొండలు, అప్పల వెంకన్న, బొడ్డు రాములు, బత్తిని శంకర్ తదితరులు పాల్గొన్నారు.