ఐద్వా ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే విగ్రహానికి నివాళులు ..

Tributes to Savitribai Phule statue under Aidwa..నవతెలంగాణ – కంఠేశ్వర్ 
మొట్టమొదటి పంతులమ్మగా నిలిచినటువంటి మహిళా సావిత్రిబాయి పూలే వారి 194వ జయంతి సందర్భంగా ఐద్వా ఆధ్వర్యంలో అంబేద్కర్ కాలనీలో సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ.. మన దేశంలో చదువు అంటే ఎలా ఉంటదో స్వేచ్ఛ అంటే ఏంటో తెలువని పరిస్థితుల్లో జ్యోతిబాపూలే తన భార్య సావిత్రిబాయి పూలకు చదువు నేర్పించి కులాలకు మతాలకు భిన్నంగా దేశ ప్రజలను ప్రేమించమని దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాలని నేర్పించి 1847 లో అట్టడుగు కులాల బాలికల పాఠశాల ప్రారంభించి భారతదేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పరిచయం చేశారు. కాబట్టి ఆ త్యాగాన్ని వృధా కానీయకుండా ఆడపిల్లల్ని గౌరవించి చదివించి సమాన హక్కుల కోసం పిడికిలి బిగించి చెయ్యి చెయ్యి కలిపి వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనపై ఉంది అని గుర్తు చేస్తూ వారి ఆశయాల కోసం ఐద్వా గా మా వంతు కృషి మేము చేస్తామని అన్నారు. ప్రవేట్ స్కూళ్లకు పర్మిషన్ ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలు మూత పడేవిధంగా ఈ ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయి. కాబట్టి పేద విద్యార్థులకు విద్య అందే విధంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి నాణ్యమైన విద్యను పేదలకు అందించే ఎంతవరకు ఐద్వా గా పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అనిత జిల్లా కమిటీ సభ్యులు మాధవి నాయకులు స్వప్న సంతోషి తదితరులు పాల్గొన్నారు.