సీపీఐ ఎంఎల్ ప్రజా పంత్ర మాస్ లైన్ ఆధ్వర్యంలో ఘన నివాళులు..

నవతెలంగాణ – రెంజల్ 

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల సీపీఐ ఎంఎల్ ప్రజా పంత మాస్ లైన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం  మండలోని సాటాపూర్ చౌరస్తాలో వారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను వారు కొనియాడారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన తమకు అన్ని విధాలుగా చేయూతను అందించారని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజా పంట మాస్ లైన్ జిల్లా నాయకులు పుట్టి నడిపి నాగన్న, మండల అధ్యక్షులు వడ్డెన్న, మండల ప్రధాన కార్యదర్శి ఎస్కే నజీర్, ఎల్. గంగాధర్, పోశెట్టి, తదితరులు పాల్గొన్నారు.